తుంగభద్ర నదీ పరవళ్లు ఓవైపు.. పచ్చదనం పరచిన ప్రకృతి అందాలు
మరోవైపు. అదే, విజయనగర సామ్రాజ్య వైభవానికి తీపి గురుతు హంపీి. అక్కడి
ఎత్తయిన కొండ గుట్టల మధ్య దాగివున్న శిల్ప సౌందర్యాన్ని మాటల్లో వర్ణించడం
కష్టమే! అలనాటి స్మారకల శిల్పసౌందర్య వైభవం తెలుసుకోవాలంటే హంపిని
సందర్శించాల్సిందే!
కర్ణాటకలోని హంపీకి చేరుకున్నాక అక్కడ సందర్శనీయ ప్రాంతాలకు తిరిగేందుకు అనువైన వాహనం ఆటో అనే చెప్పుకోవాలి. ఒక రోజంతా తిప్పడానికి అనువైన 700 నుంచి వెయ్యి రూపాయలు తీసుకుంటారు. హంపీలోని ఆటోడ్రైవర్లు మంచి గైడ్స్‌గా పేరొందారు. వారికి ఇక్కడి చుట్టుపక్కల కట్టడాలపై పూర్తి అవగాహన ఉంటుంది. హంపీలో 1600 మోమోరియల్స్ ఉన్నాయి. అందులో 80 కంటే ఎక్కువ ప్రసిద్ధి చెందినవి.
విఠ్ఠల టెంపుల్ కాంప్లెక్స్
హంపీ ప్రాంతం విజయనగర సామ్రాజ్య వైభవానికి ప్రతీక. అలాంటి హంపీికి తలమానికంగా నిలిచేది విఠ్ఠల దేవాలయం. తుంగభద్ర నది ఒడ్డున దక్షిణం వైపున ఉన్న ఈ దేవాలయం హంపీి నగరంలో ఎక్కువగా సందర్శించే ప్రాంతంగా గుర్తింపు పొందింది. రెండవ దేవరాయ కాలంలో నిర్మించ బడిన ఆలయం పూర్తి రాతి కట్టడం. ఇది 16వ శతాబ్దానికి చెందింది.
ఈ ఆలయానికి ఎదురుగా ప్రసిద్ది చెందిన రాతి రథం ఉంది. ఏకశిలతో తయారుచెయ్యబడిన ఈ రథం సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఏకశిలా రథం అంటే, ఒకే శిలతో దీన్ని నిర్మించారు. ఒడిశాలోని కోణార్క్ ఆలయం స్పూర్తితో ఈ ఏకశిలా రథాన్ని తీర్చిదిద్దారు. అయితే, ఈ రథం పూర్వ వైభవాన్ని కోల్పోయిందని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. రథం గోపురం, రథం ముందున్న ఏనుగు తొండాలను కత్తిరించారు. చుట్టూ సైనికులు, వేటగాళ్లు, పోర్చుగీసులు, అరబ్బులు, పర్షియన్ల చిత్రాలున్నాయి.
ఈ ఆలయంలోని మరొక ఆకర్షణ సంగీతం వినిపించే స్తంభాలు. ప్రధాన స్తంభాం చుట్టూ ఏడు చిన్నపాటి స్తంభాలు ఉంటాయి. ఈ ఏడు స్తంభాలను తాకినప్పుడు సంబంధిత వాయిద్య పరికరం సప్తస్వరాలను పలుకుతూ ఉంటాయి.
అద్భుత శిల్పకళా నిలయం
హంపీిలోని అందమైన మందిరాలలో కృష్ణమందిరం ఒకటి. విజయనగర మహారాజు కృష్ణదేవరారున్ కళింగ విజయం తర్వాత దీన్ని కట్టించారు. ఈ మందిరంలో ఉన్న కృష్ణ విగ్రహాన్ని ఒడిశా నుంచి తీసుకొచ్చారని ఇక్కడి స్థానికులు చెబుతుంటారు. 1513లో కృష్ణదేవరాయలు కళింగ నుంచి ఈ బాలకృష్ణమూర్తి విగ్రహాన్ని తీసుకొచ్చి, ఇక్కడ ఈ మందిరంలో స్థాపించారట! ప్రస్తుతం ఇక్కడ ఈ విగ్రహం లేదు. ఈ విగ్రహం చెన్నెయిలోని మ్యూజియంలో ప్రత్యేక ఆకర్షణగా ఉంది. పంచాయతన్ శైలిలో ఉన్న
ఈ మందిరంలో చాలా ఉప మందిరాలు, పాకలు, మహామండపాలు ఉన్నాయి. మహామండ పంలో విష్ణుమూర్తి దశావతారాలు అద్భుతంగా చిత్రించి ఉంటాయి. మందిరంలోని పరిసరాలు సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. అలా ముందుకు నడుచుకుంటూ వెళ్లగానే రెండురాళ్లు మిళితమై ఉన్న ఓ దృశ్యం చూపరులను కట్టిపడేస్తుంది. ఆ రెండు రాళ్లను చూస్తే పెనుగులాడుకుంటున్నట్లు కనిపిస్తాయి. అందుకే వీటిని 'సిస్టర్ రాక్స్' అని పిలుస్తారు.
పురంధరదాసు మంటపం
తుంగభద్ర నదీ తీరంలో నిర్మించిన శిలాభవనమే పురంధరదాసు మంటపం. క్రీస్తుశకం 1540లో రాయలు ఈ శిలా భవనాన్ని నిర్మించారు. ఆ సమయంలో ఉన్న పురంధరదాసు భక్తి గేయాలను రచించి వినిపిస్తుండేవారట! దాస సాహిత్యం, సంస్కృతి నలు దిశలా వెలుగొందాలని రాయలు ఈ మంటపాన్ని నిర్మించారు. వర్షాకాలంలో తుంగభద్ర ఎన్నోసార్లు పొంగి పొర్లి, మంటపం మునిగిపోయినా ఏమాత్రం చెక్కుచెదరలేదు.
లోటస్‌మహల్, గజశాల!
ఇక్కడికి దగ్గరలోని మహానవమి దిబ్బ నుంచి కొంత ముందుకు వెళితే కనిపించేదే 'లోటస్ మహల్' (కమల మందిరం) దీన్ని చిత్రాంగిణి మహల్ అని కూడా పిలుస్తారు. ఈ 'లోటస్ మహల్' హిందూ, ముస్లిం శైలిలో ఉండటం విశేషం. ఈ మహల్ చుట్టూ ఉద్యానవనం ఉన్న ఆనవాళ్లు, కోట ప్రాంతం, రక్షకభట నిలయం ఉన్నది చూస్తే ఇక్కడ మహారాణులు విశ్రాంతి నిమిత్తం వచ్చే వారని చరిత్రకారులు చెబుతారు. 'లోటస్‌మహల్' పక్కగా గజశాల కనిపిస్తుంది. ఇందులో విజయనగర రాజులు ఏనుగులను పోషించేవారని అక్కడివారు చెబుతుంటారు. 11 ఏనుగులు ఆశ్రయం పొందటానికి ఇక్కడ గజశాల ఉంది. భవ్యమైన కమానులు కలిగిన ఈ భవనం ఇప్పటికీ చెక్కు చెదరలేదు.
హంపీి బజార్
విరూపాక్ష బజార్‌గా ప్రాచుర్యం చెందిన ఓ ప్రాంతం సందర్శకులకు మరో ప్రత్యేక ఆకర్షణ. ఇది విరూపాక్ష ఆలయానికి ఎదురుగా ఉంటుంది. మాతంగి కొండ క్రింద కొండ వద్ద ఉన్న ఈ ప్రాంతం విరుపాక్ష ఆలయానికి తూర్పు నుంచి కిలోమీటరు దూరంలో కనిపిస్తుంది. ఈ వీధికి రెండువైపులా పాత దుకాణాల వరుస ఉంటుంది. కొన్ని రెండు అంతస్తులు ఉన్నవి కూడా తారసపడతాయి. ఈ వీధికి తూర్పు చివరన భారీ నంది విగ్రహం, ఆ విగ్రహం పక్కనే రెండు అంతస్తులు కలిగిన ఫోటో గ్యాలరీ ఉంటుంది. అలెగ్జాండర్ గ్రీన్ లా చేత 1856 లో తీయబడిన ఛాయాచిత్రాలు ఇక్కడి ప్రదర్శనలో ఉన్నాయి. సమీపంలో ఉన్న బహిరంగ వేదిక వార్షిక హంపీ వేడుకలకు ప్రధాన వేదికగా వ్యవహరిస్తుంది. ఈ గ్యాలరీకి ఎదురుగా కొంచెం దూరంలో గ్రామంలోని పిల్లల కోసం ఏర్పాటైన నర్సరీ స్కూల్‌ని గమనించవచ్చు. ఇది ప్రపంచంలోనే పురాతనమైన నర్సరీ స్కూల్‌గా అక్కడివారు భావిస్తున్నారు. ఇవేకాకుండా హంపీలో సందర్శించవలసిన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. గొప్ప చారిత్రక ప్రదేశమైన హంసీలో అడుగుపెడితే మనకి కళ్ళకు కట్టినట్టుగా టైం మెషిన్‌లో ప్రయాణం చేసినట్లుగా మనల్ని ఆనాటి రోజులకి తీసుకోపోతుంది.
చేరుకోవడం ఎలా?
హంపీని వాయు మార్గంలో చేరుకునేందుకు విమానాశ్రయం లేదు. ఇక్కడికి దగ్గరలో 60 కిలోమీటర్ల దూరంలో బళ్ళారి వద్ద దేశీయ విమానాశ్రయం ఉంది. ఈ విమానాశ్రయం బెంగళూరు, ముంబయి, నాగ్‌పూర్, హైదరాబాద్, తిరుపతి వంటి నగరాలకు అనుసంధానమై ఉంది. ఈ విమానాశ్రయంలో దిగి క్యాబ్ లేదా ఇతర రవాణా సాధనాలను ఉపయోగించి హంపీ చేరుకోవచ్చు. రైలు మార్గంలో అయితే, హంపీలో రైల్వేస్టేషన్ లేదు. దీనికి సమీపాన ఉన్న రైల్వేస్టేషన్ హోస్పేట్ రైల్వే స్టేషన్. ఇది హంపీి నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. బెంగళూరు, హుబ్లీ, పూణే, సొలాపూర్, చెన్నై, ముంబయి, బెల్గాం, పనాజీ, హైదరాబాద్ వంటి నగరాల నుంచి నిత్యం రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. హోస్పేట్ రైల్వేస్టేషన్‌లో దిగి, బస్సు లేదా క్యాబ్ వంటి వాహనాల్లో హంపీి చేరుకోవచ్చు. రోడ్డు మార్గం చారిత్రక పట్టణమైన హంపీికి కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి బస్సులు నిత్యం అందుబాటులో ఉంటాయి. చక్కటి రోడ్డు వ్యవస్థ కలిగిన హంపీకి బళ్ళారి, బెంగళూరు వంటి ప్రదేశాల నుంచి ప్రభుత్వ బస్సులు, ప్రైవేట్ బస్సులు అందుబాటులో ఉంటాయి.
సేకరణ : చందు తిలారు

No comments:
Post a Comment